![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -656 లో.... రాజ్ కి కావ్య భోజనం తీసుకొని వెళ్తుంది. ఆ తర్వాత రాజ్ కి భోజనం తినిపిస్తుంది. కావ్య బాధపడుతుంటే నువ్వు ఇలా బాధపడితే.. నన్ను ఎవరు బయటకు తీసుకొని వస్తారని రాజ్ అంటాడు. కావ్య ఎమోషనల్ గా హగ్ చేసుకుంటుంది. ఆ తర్వాత కోర్ట్ లో రాజ్ తరుపున లాయర్ వాదిస్తాడు.
ఫింగర్ ప్రింట్ ఆధారంగా చూస్తే ఆ రాడ్ పై ఉన్న ఫింగర్ ప్రింట్స్ రాజ్ ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అయ్యాయని జడ్జ్ చెప్పగానే అందరు షాక్ అవుతారు. రాజ్ రౌడీలని రాడ్ పట్టుకొని వెంబడించిన విషయం గుర్తుచేసుకుంటాడు. అసలేం జరిగిందో చెప్తానంటూ రాజ్ ఆ రోజు రాడ్ పట్టుకొని రౌడీలని బెదిరించి అది పక్కకి పడేసానని చెప్తాడు. రాజ్ కీ సపోర్ట్ గా తన లాయర్ మాట్లాడతాడు. నిజాలు నిరూపించేందుకు కొంత టైమ్ కావాలని లాయర్ అడుగగా.. కేసుని మరుసటి రోజుకి జడ్జ్ వాయిదా వేస్తాడు. రాజ్ ని చూసి అపర్ణ బాధపడుతుంది. ఆ హత్య మీరు చెయ్యలేదని నాకు తెలుసు ఆ నమ్మకం తోనే ఆ రాడ్ తీసుకొని వచ్చాను కానీ వాటిపై మీ వేలి ముద్రలు ఉండడం నాకు ఆశ్చర్యంగా ఉందని అప్పు అంటుంది. ఆ తర్వాత అనామిక వచ్చి ఏదో చేస్తానని ఏదో చేసావని అప్పుతో అంటుంది.
మా బావని తెలివిగా ఇరికించాను అనుకుంటున్నావా అని అప్పు అంటుంది. మేం ఎలాగైనా బావని బయటకు తీసుకొని వస్తామని అప్పు అంటుంది. ఆ తర్వాత కావ్య, అప్పులు ఇంటికి వచ్చాక రుద్రాణి, ధాన్యలక్ష్మిలు కలిసి విరుచుకుపడతారు. తరువాయి భాగంలో అప్పు, కావ్యలు రౌడీని వెతుక్కుంటూ వెళ్తారు. మరొకవైపు రాజ్ కి ప్రతికూలంగా జడ్జిమెంట్ ఇస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |